విచ్చలవిడిగా డబ్బు, మద్యం | - | Sakshi
Sakshi News home page

విచ్చలవిడిగా డబ్బు, మద్యం

Dec 14 2025 1:37 PM | Updated on Dec 14 2025 1:37 PM

విచ్చలవిడిగా డబ్బు, మద్యం

విచ్చలవిడిగా డబ్బు, మద్యం

పోటాపోటీగా ఓటర్లకు పంపిణీ

గెలుపు కోసం సర్వశక్తులు

ఒడ్డుతున్న అభ్యర్థులు

దుబ్బాక: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. ఈ క్రమంలో విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసినట్లు విశ్వసనీయంగా సమాచారం. మండల కేంద్రాలతో పాటు, ప్రధాన గ్రామాల్లో పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు దేనికి వెనుకాడకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు వినికిడి.

ఓటుకు రూ.2 నుంచి 4 వేలు

కొన్ని ప్రధాన గ్రామాల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నుంచి 4 వేల వరకు ఇంటింటికీ పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే పలనా వారు రూ.2 వేలు ఇచ్చినట్లు తెలిస్తే.. కొందరు ఓటుకు రూ.3 వేలు సైతం ఇచ్చిటన్లు సమాచారం. ఓ వైపు పోలీసులు గ్రామాల్లో నిఘా పెట్టినప్పటికీ అభ్యర్థులు మాత్రం యథేచ్ఛగా డబ్బులు, మద్యం పంపిణీ చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement