పల్లె తీర్పు నేడే
మొదటి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
పోలింగ్ సామగ్రితో సిబ్బంది
గజ్వేల్: జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, మర్కూక్‌తోపాటు దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో 163 పంచాయతీలున్నాయి. ఇందులో 16 సర్పంచ్, 224 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 147 సర్పంచ్, 1208వార్డుల్లో పోలింగ్ జరగనున్నది.
ఎన్నికల సామగ్రి పంపిణీ..
ఎన్నికల సిబ్బందికి అధికారులు సామగ్రి అందజేశారు. గజ్వేల్ మండలానికి సంబంధించి పట్టణంలోని ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో, మర్కూక్ మండలానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ములుగు మండలానికి రైతు వేదిక, వర్గల్ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జగదేవ్‌పూర్ మండలానికి ఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో, దౌల్తాబాద్ మండలానికి తెలంగాణ మోడల్ స్కూల్‌లో, రాయపోల్ మండలానికి జీఎల్‌ఆర్ ఫంక్షన్‌హాలులో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గజ్వేల్, ములుగు, రాయపోల్, దౌల్తాబాద్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ హైమావతి, అధికారులు పోలింగ్ నిర్వహణపై సూచనలు చేశారు. సాయంత్రం పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకుసామగ్రితో తరలివెళ్లారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. ఇందులోభాగంగా ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు ఏసీపీలు, 15మంది సీఐలు, 35మంది ఎస్‌ఐలు, రెండు ఫ్లటూన్లు, 900మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు కలుపుకొని 1010 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింహులు తెలిపారు.
మండలాల వారీగా ఓటర్ల వివరాలు..
గజ్వేల్ మండలంలో 34,006మంది ఓటర్లు ఉండగా, ఇందులో 16,544 మంది పురుషులు, 17,460మంది మహిళలు, మరో ఇద్దరు ఇతరులు ఉన్నారు.
ములుగు మండలంలో 31,055మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 15,450మంది పురుషులు, 15,605మంది మహిళలు ఉన్నారు.
మర్కూక్ మండలంలో 19,493 మంది ఓటర్లుకుగానూ 9,575మంది పురుషులు, 9,918మంది మహిళలు ఉన్నారు.
వర్గల్ మండలంలో 29,241ఓటర్లు ఉన్నారు. ఇందులో 14,458మంది పురుషులు, 14,783 మంది మహిళలు ఉన్నారు.
జగదేవ్‌పూర్ మండలంలో 31,298మంది ఓటర్లకుగానూ 15,305మంది పురుషులు, 15,993మంది మహిళలు ఉన్నారు.
దౌల్తాబాద్ మండలంలో 24,484మంది ఓటర్లకుగానూ 11,974మంది పురుషులు, 12,510మంది మహిళలు ఉన్నారు.
రాయపోల్ మండలంలో 21,529మంది ఓటర్లకుగానూ 10,524మంది పురుషులు, 11,005మంది మహిళలు ఉన్నారు.
పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు కలుపుకొని మొత్తంగా 3,600మందికిపైగా నియమించారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో
భద్రత కట్టుదిట్టం
147 సర్పంచ్,
1208 వార్డుల స్థానాల్లో ఎన్నికలు
ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలు ఇవే..
రంగంపేట(గజ్వేల్), ఎర్రవల్లి, నర్సన్నపేట(మర్కూక్), జప్తి సింగాయపల్లి(ములుగు), పలుగుగడ్డ, బీజీ వెంకటాపూర్, నిర్మల్‌నగర్, అనంతసాగర్, కొండాపూర్(జగదేవ్‌పూర్), గుంటిపల్లి, చాంద్‌ఖాన్‌మక్త, తునికి మక్త(వర్గల్) ఆరేపల్లి, కొత్తపల్లి(రాయపోల్), నర్సంపల్లి, లింగాయపల్లి తండా(దౌల్తాబాద్)లు ఉన్నాయి.
పల్లె తీర్పు నేడే
పల్లె తీర్పు నేడే


