పటిష్ట బందోబస్తు
సీపీ విజయ్‌కుమార్
సిద్దిపేటకమాన్: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట అర్బన్, రూరల్, అక్బర్‌పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, తొగుట మండలాల్లో ఈ నెల 14న పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100మీటర్ల లోపల, ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గంలో ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని తెలిపారు.


