ఉద్యాన డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం
ములుగు(గజ్వేల్): ఉద్యాన విశ్వవిద్యాలయంలోని డిగ్రీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17న ఉదయం 10:30 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కంబైన్డ్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు సమర్పించాలన్నారు. ఎప్‌సెట్ –2025లో ర్యాంకు పొందిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు హాజరు కావచ్చన్నారు. విశ్వవిద్యాలయం పరీక్షా కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 96524 56779 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
గ్రామాల్లో వైద్య శిబిరాలు
నిర్వహించండి: జడ్జి రేవతి
హుస్నాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీంలు ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రేవతి కోరారు. శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. వైద్య పరికరాలు, మందులు పరిశీలించారు. అనంతరం జడ్జి రేవతి మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో, పాఠశాలల్లో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించి వైద్యం అందించాలని కోరారు. అనంతరం కోర్టు హాల్‌లో ఈ నెల 21న నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రమిద, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి, న్యాయవాదులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చదువుతోనే
ఉజ్వల భవిష్యత్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌చంద్రబోస్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత వసతి గృహం ఆవరణలో విద్యార్థులను కలిసి మాట్లాడారు. వసతి గృహంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను, క్రమశిక్షణ, సమయపాలనను అలవర్చుకోవాలన్నారు.
పీఓ, ఏపీఓలకు శిక్షణ
హుస్నాబాద్‌రూరల్: డివిజన్‌లో 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనుండగా పీఓ, ఏపీఓ అధికారులకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేశ్ మాట్లాడుతూ గ్రామాల్లో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్స్‌లు సీల్ వేయడం, ఓట్ల లెక్కింపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు త్వరగా బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలన్నారు.
మద్దూరులో..
మద్దూరు(హుస్నాబాద్): ఉమ్మడి మద్దూరు మండల పరిధిలో శుక్రవారం ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. పోలింగ్ రోజున నిర్వహించాల్సిన విధులపై శిక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మద్దూరు, ధూళ్మిట్ట మండలాల ఎంపీడీఓలు, ఎంఈవోలు పాల్గొన్నారు.
ఫోన్ ఇన్ కార్యక్రమం రద్దు
సిద్దిపేటకమాన్: సామాన్య ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి శనివారం సీపీతో నిర్వహించే ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం లేదని సీపీ విజయ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఫోన్ ఇన్ కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 20న యథావిధిగా తిరిగి నిర్వహించనున్నట్లు సీపీ పేర్కొన్నారు.
ఉద్యాన డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం
ఉద్యాన డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం


