మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని అదనపు సీనియర్ జడ్జి సంతోష్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు సీనియర్ జడ్జి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందన్నారు. మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు. భంగం వాటిల్లితే మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ శరత్‌బాబు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
010 ఖాతా ద్వారా
జీతాలు చెల్లించాలి
గజ్వేల్‌రూరల్: ఉద్యోగుల వేతనాలను 010 ఖాతా ద్వారా చెల్లించాలని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రధాన ఖాతా (010) ద్వారా వేతనాలు చెల్లించడం ద్వారా పారదర్శకత, ఉద్యోగ భద్రత అంశాల్లో స్పష్టత లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు, వైద్యు లు, నర్సింగ్ అధికారులు, పారా వైద్య సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
ఆన్‌డ్యూటీగా పరిగణించండి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గ్రామ పంచాయతీ ఎన్నిలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు పోలింగ్ మరుసటి రోజు ఓడీ (ఆన్ డ్యూటీ)గా పరిగణించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. బుధవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతల్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు పోలింగ్ డే మరుసటి రోజున విధులకు రావడం సాధ్యం కాదన్నారు. అందువలన పోలింగ్ మరుసటి రోజున ఓడీ ఇవ్వాలన్నారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని డీఈఓ తెలిపారన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి, జిల్లా కార్యదర్శి గ్యార ప్రవీణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు తలారి కనకయ్య, కిషన్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
నేడు పత్తి కొనుగోళ్లు బంద్
గజ్వేల్‌రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ మండలం పిడిచెడ్ సమీపంలోని ఈశ్వరసాయి కాటన్ ఇండస్ట్రీస్, సాయి బాలాజీ కాటన్ ఇండస్ట్రీస్, శివగంగా కాటన్ ఇండస్ట్రీస్(బయ్యారం)తో పాటు పట్టణ శివారులోని శ్రీ వాసవి కాటన్ ఇండస్ట్రీస్(జిన్నింగ్ మిల్)లలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరగవని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజున కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ ఉండదని, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మూసి ఉంటుందని తెలిపారు. రైతులు విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.
మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత


