చలి మంటలు
మిరుదొడ్డి(దుబ్బాక): మునుపెన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరిగిపోతోంది. ఒక్క భూంపల్లి మండలంలోనే 8.9 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలి తీవ్రతను తెలియజేస్తోంది. ఉదయం పొగ మంచుతో జనాలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సాయంత్రం 5 దాటిందంటే చాలు చలి తీవ్రతతో ఇండ్ల నుండి జనాలు బయటకు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అస్తమా వ్యాధిగ్రస్తులు శ్వాస కోశ సంబంధమైన ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే మంకీ క్యాపులు, స్వెట్టర్లు ధరిస్తున్నారు. రాత్రి పూట చలిమంటలతో జనాలు ఉపశమనం పొందుతున్నారు.


