‘రైతు రత్న’కు దరఖాస్తు చేసుకోండి
సిద్దిపేటఅర్బన్: అభ్యుదయ రైతులకు అందజేసే రైతు రత్న అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్రీనాథ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుస్థిర, సమీకృత, వినూత్న వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు, సేంద్రియ, వాతావరణ స్నేహపూర్వక వ్యవసాయానికి విశిష్టమైన సేవలు అందించిన రైతులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. వచ్చిన దరఖాస్తులను రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం సభ్యులు పరిశీలించి ఉత్తమ రైతులను ఎంపిక చేస్తారన్నారు. పురస్కారాలను మహా కిసాన్ మేళా–2025 సందర్భంగా డిసెంబర్ 3, 4 తేదీలలో హైదరాబాద్‌లోని కన్హ శాంతి వనంలో ప్రదానం చేస్తారన్నారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులను అందజేయాలని సూచించారు.
సిద్దిపేటకమాన్: పుస్కారాలు ఇవ్వడం, బాలల కథా పోటీలను ప్రోత్సహించడం సాహిత్యాభివృద్ధికి ఎంతో ముఖ్యమని నరసింహారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో వాణి సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో పెందోట పురస్కారాల ప్రధాన సభ, 2025 బాలల కథల పోటీల బహుమతి ప్రదానత్సోవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సాహిత్య కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. దీంతో పాటు నాలుగు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అశోక్, రాజు, పరశురాములు, రాజమౌళి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కొండపాక(గజ్వేల్): గ్రామీణ జీవితంలోని వాస్తవికతను, కష్ట జీవితాన్ని చరిత్రగా నిలిపేవి నవలలని ప్రజా రచయిత నాళేశ్వరం శంకరం అన్నారు. కొండపాక మండలం బందారం గ్రామంలో సిదారెడ్డి రచించిన నాగటి తరం నవలను ఆదివారం ఆవిష్కరించారు. మంజీరా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిష్కరణ సభకు సాహితీ వేత్తలు, కళాకారులు, రాజకీయ కార్యక్రర్తలు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శంకరం మాట్లాడుతూ గ్రామాన్ని అర్థం చేసుకుంటే యావత్ దేశాన్ని అర్థం చేసుకున్నట్లేనన్నారు. భాషా, పల్లె జీవన విధానంలోని వాస్తవికతను సిధారెడ్డి నవల ద్వారా స్పష్టమవుతుందన్నారు. సీపీఎం జిల్లా నాయకుడు నక్క యాదవరెడ్డి మాట్లాడుతూ దోపిడీ, అన్యాయం కొత్త రూపాల్లో వస్తున్న ఈ సమయంలో నాగటి తరం నవలలో కనిపించే పాత్రలు మన సమాజం నడిచే నీడలను వెలుగులోకి తెస్తాయన్నారు. ప్రజా గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాటలతో సభకు నూతన ఉత్సాహాన్ని తెచ్చారు. కార్యక్రమంలో రచయితలు దేవీశ్రీ ప్రసాద్,పాసింజర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
బెజ్జంకి(సిద్దిపేట): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక స్థానాలు గెలుపొంది సత్తా చాటాలాని బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపునిచ్చారు. బెజ్జంకిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. 19న కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో నిర్వహించనన్న బూత్‌స్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. కొలిపాక రాజు, బుర్ర మల్లేశంగౌడ్, రామచంద్రం, సంగ రవి, తూముల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘రైతు రత్న’కు దరఖాస్తు చేసుకోండి
‘రైతు రత్న’కు దరఖాస్తు చేసుకోండి


