కలలు సాకారం చేసుకోవాలి
సీపీ విజయ్‌కుమార్
సిద్దిపేటరూరల్: విద్యార్థులు కలలు సాకారం చేసుకునేందుకు బాగా కష్టపడాలని సీపీ విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పిల్లలకు గుడ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 100కు డయల్ చేయాలన్నారు. చైల్డ్ కేర్‌సెంటర్‌లో ఉంటున్నామని నిరాశ పడకుండా ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. సమాజంలో జరిగే అన్ని విషయాలను తెలుసుకోవాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలు ఆటలు బాగా అడుతూ మంచి ఆహారాన్ని కడుపునిండా తినాలన్నారు. అనంతరం బాలికల సంరక్షణకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పలు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ శారదా, డీఆర్‌ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీఎంహెచ్‌ఓ ధనరాజ్, డీపీఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


