యువతతోనే సమాజంలో మార్పు
మెదక్‌జోన్: యువతరంతోనే సమ సమాజ నిర్మాణం జరుగుతుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలను జిల్లా యువజన వ్యవహారా లు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఎంపీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్య్రం తర్వాత 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన గొప్ప సమైక్యతవాదన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ.. వల్లభాయ్ పటేల్ కృషిని కొనియాడారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా యువజన క్రీడల అధికారి రంజిత్‌రెడ్డి, డీఐఎస్‌ఓ రమేశ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మోడల్ లైబ్రరీగా తీర్చిదిద్దాలి
మెదక్ గ్రంథాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దాలని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. రూ. 5 లక్షల విలువైన పుస్తకాలను లైబ్రరీకి అందిస్తానని తెలిపారు. పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. పుస్తకాలు నూతన విషయాలు, వివిధ సమాచార వనరులు, ప్రయోగాలపై అవగాహన పెంచడానికి కీలకంగా నిలుస్తున్నాయని పేర్కొ న్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు


