గురుకులాల్లో ‘కామన్ డైట్’ తప్పనిసరి
కలెక్టర్ హైమావతి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గురుకులాలల్లో తప్పనిసరిగా కామన్ డైట్‌ను పాటించాలని కలెక్టర్ హైమావతి సిబ్బందికి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. డైట్, హాజరు, వంట సరుకుల రిజిస్టర్ లను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలతో రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. స్టోర్ రూమ్‌లో కూరగాయలను, సరుకులను తనిఖీ చేశారు. వంట గది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


