జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి మిలిం
సత్ప్రవర్తనతో ఉండాలి
సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి మిలింద్ కాంబ్లే పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా జైలును శనివారం న్యాయమూర్తి సందర్శించారు. ఖైదీల వంట గది, స్టోర్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఖైదీలందరికీ అడ్వొకేట్స్ ఉండాలన్నారు. ఖైదీలకు న్యాయపరమైన సహాయం కోసం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వారానికి మూడుసార్లు జైలుని సందర్శిస్తారని, అడ్వొకేట్స్ లేని వారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, జైలు సిబ్బంది, న్యాయసేవ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


