ఓటర్ జాబితాను సీడీమ్యాపింగ్ చేస్తాం
వీడియో సదస్సులో కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాను బీఎల్‌ఓ యాప్ ద్వారా సరిచూసుకుని సీడీమ్యాపింగ్ చేసుకుంటామని కలెక్టర్ కె.హైమావతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. ఎన్నికల కమిషన్ సీఈఓ సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్‌లతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ రెండు పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ సూపర్‌వైజర్లకు శిక్షణ అందిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన ఆహారం అందించాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం రాత్రి మండల పరిధిలోని అల్లీపూర్ కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందించే భోజనాలను పరిశీలించారు. వంట సరుకులు, సన్న బియ్యం నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పాఠశాల ఆవరణలో ఎక్కువ వెలుతురు లైట్లు అమర్చాలని విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్‌లో ఆదేశించారు. అనంతరం చిన్నకోడూరు పీహెచ్‌సీని సందర్శించారు. అత్యవసర వైద్య సేవలు పరిశీలించారు.


