
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
దీపకాంతులు విరబూసె.. తారాజువ్వలు ఎగిసె
అంబరాన్నంటిన దీపావళి సంబురాలు
జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం తెల్లవారుజామునుంచే పల్లెల్లో, పట్టణాల్లో పండుగ కోలాహలం నెలకొంది. దీపకాంతులతో ఇళ్లు, దుకాణాలను సుందరంగా అలంకరించారు. గృహాల్లో, వ్యాపార సముదాయాల్లో, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీపూజలు, కేదారేశ్వర వ్రతాలు చేపట్టారు. చిమ్మని చీకట్లలో దీపాలు వెలుగులను విరజిమ్మాయి. వాడవాడలో యువతీయువకులు బాణాసంచా కాల్చారు. తారా జువ్వల మెరుపులు కనువిందు చేశాయి.
–ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)

బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025