
నేడు నాచగిరిలో గిరి ప్రదక్షిణ
వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో బుధవారం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఉదయం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రవీందర్‌గుప్తా, ఈఓ విజయరామారావు తెలిపారు. ఉదయం 7.30 గంటలకు రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. గిరి ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరారు.
రేపు జోడో
క్రీడాకారుల ఎంపిక
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉమ్మడి జిల్లా జోడో క్రీడాకారుల ఎంపిక ఈ నెల 23న జిల్లా కేంద్రంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరగనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌందర్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి జోడో క్రీడాకారుల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు భరత్‌రెడ్డి (924666472), చామంతుల భరత్(9505450223)లను సంప్రదించాలన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించండి
హుస్నాబాద్: గిరిజన గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న దినసరి కూలీలకు ఉద్యోగ భధ్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ పట్టణంలో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 40 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకిరి చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గెజిట్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు.
సాగు నీరు అందించండి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మిట్ట ప్రాంత రైతులకు సాగు నీరు అందించాలని చిన్నగుండవెల్లి, రాంపూర్ గ్రామాల రైతులు కోరారు. మల్లన్నసాగర్ కెనాల్ ద్వారా వచ్చే సాగు నీటిని మిట్ట ప్రాంతాలకు పైపులైన్ ద్వారా అందించాలన్నారు. ఈ మేరకు మంగళవారం సిద్దిపేట నీటిపారుదల కార్యనిర్వహకశాఖ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీరు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కార్యక్రమంలో రాంపూర్, చిన్నగుండవెల్లి గ్రామాలకు చెందిన రైతులు తిరుపతి, క్రాంతికుమార్, మల్లేశం, భూపతి రెడి, ప్రతాప్ రెడ్డి, మహేందర్, కనకరెడి, శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డి, రాజిరెడ్డి, కామలాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నేడు నాచగిరిలో గిరి ప్రదక్షిణ

నేడు నాచగిరిలో గిరి ప్రదక్షిణ