
మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించండి
సిద్దిపేటరూరల్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలను, బిల్లులను చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, ఏఓకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు 8 నెలలుగా బిల్లులు రావడంలేదన్నారన్నారు. కలెక్టర్ పాఠశాలలను సందర్శిస్తూ భోజనాలు నాసిరకంగా వండుతున్నారని చెప్తున్నారని, కానీ వారికి రావాల్సిన బిల్లులను పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికై నా పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే నవంబర్ 1 నుంచి భోజనం వడ్డించడం నిలిపివేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.