
పూలు అగ్గువ.. కొబ్బరి పిరం
నేడే వెలుగుల దీపావళి
● లక్ష్మీపూజలకు సిద్ధమైన జిల్లా ప్రజలు ● మార్కెట్లలో కొనుగోళ్ల సందడి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అందరి జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి పండుగను నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఆలయాలు, గృహాలను అందంగా ముస్తాబు చేశారు. లక్ష్మి, కేదారేశ్వరి పూజల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. వివిధ రకాల ప్రమిదల విక్రయాలు మార్కెట్లలో జోరుగా సాగాయి. రూ.1 నుంచి రూ.150 వరకు ప్రమిదల ధరలు పలుకుతున్నాయి. అయితే ఈసారి పూల ధరలు తగ్గాయి. బంతి పూలు కిలోకు రూ.30 నుంచి 50 వరకు పలుకుతున్నాయి. దీంతో భక్తులు పూలను భారీగా కొనుగోలు చేస్తున్నారు. రైతులే మార్కెట్‌లో విక్రయాలకు తరలిస్తుండటంతో ధరలు తగ్గాయి. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ముఖ్య పట్టణాలలో బంతిపూల విక్రయాలు జోరుగా సాగాయి. చామంతి పూలు కిలోకు రూ.150 నుంచి రూ.200వరకు విక్రయిస్తున్నారు. అయితే కొబ్బరికాయల ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఒక్క టెంకాయ ధర రూ.30 నుంచి 45 వరకు పలుకుతుండటం గమనార్హం.
జోరుగా బాణాసంచా విక్రయాలు
జిల్లా కేంద్రంతో పాటుగా, ప్రధాన పట్టణాలలో బాణాసంచా విక్రయశాలలు వెలిశాయి. విక్రయాలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రం నుంచి వివిధ జిల్లాలకు టపాసులు హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు.
తగ్గిన బంగారం కొనుగోళ్లు

పూలు అగ్గువ.. కొబ్బరి పిరం