
నేటి ప్రజావాణి రద్దు
సిద్దిపేటరూరల్: దీపావళి పండుగను పురస్కరించుకుని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఎవరూ అర్జీల దృష్ట్యా కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.
మల్లన్న ఆలయంలో
భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
22 నుంచి ప్రత్యేక పూజలు
ఆలయంలో కార్తీకమాసాన్ని పురష్కరించుకుని ఈనెల 22 నుంచి నవంబర్ 2 వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వెంకటేశ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నిత్యం సాయంత్రం
6 నుంచి 8 గంటల వరకు సామూహిక దీపోత్సవం, కార్తీక సోమవారాలలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, నోములు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు, హరికథలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మద్యం దరఖాస్తుల
గడువు పెంపు
సిద్దిపేటకమాన్: మద్యం దుకాణాల నిర్వహణకు చేపడుతున్న దరఖాస్తుల గడువును పెంచినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసమూర్తి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మొదట నిర్ణయించిన ప్రకారం ఈ నెల 18 చివరి తేదీగా నిర్ణయించడంతో ఆఖరి రోజు భారీగా 1,392 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఎకై ్సజ్ కార్యాలయంలో శనివారం రాత్రి పొద్దుపోయే వరకు దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. బీసీ బంద్ నేపథ్యంలో బ్యాంకులు మూసి వేసి ఉండటంతో దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పెంచినట్లు తెలిపారు. డిపాజిట్ ధర రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడం కూడా దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రాలేదని తెలుస్తోంది. అదేవిదంగా ఈ నెల 23న నిర్వహించాల్సిన లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఈ నెల 27న కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
వృథాగా భగీరథ నీరు
చేర్యాల(సిద్దిపేట): తాగు నీటి సరఫరా పైపు లైన్ పగిలి మిషన్ భగీరథ నీరు వృథాగా పోయింది. మండల పరిధిలోని గుర్జకుంట క్రాస్ రోడ్డు సమీపంలో ఆదివారం మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ పగిలింది. దీంతో నీరంతా వృథా అయ్యింది.
హోరాహోరీగా
పద్మశాలి ఎన్నికలు
సంఘం అధ్యక్షుడిగా దేవదాసు విజయం
గజ్వేల్: ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సంఘం ఎన్నికల్లో బొల్లిబొత్తుల దేవదాస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్‌హాల్‌లో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఒక్కరు మినహా దేవదాస్ ప్యానెల్ కార్యవర్గం విజయం సాధించింది. ఉపాధ్యక్షులుగా కోట కిశోర్, ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి ఎల్లం రాజు, కోశాధికారిగా హనుమాన్‌దాస్‌లు ఎన్నికయ్యారు. సంయక్త కార్యదర్శి మాత్రం ప్రత్యర్థి ప్యానెల్‌కు చెందిన పాశుకంటి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన టీ. రాజు గెలుపొందిన వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు