
పార్టీలకతీతంగా ఉదారత్వం
సిద్దిపేటరూరల్: ఆపద వస్తే పార్టీలు చూసేది లేదని, ప్రజలే తనకు ముఖ్యమని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పెద్దలింగారెడ్డి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి ఇల్లు ఇటీవల విద్యుత్‌షాక్‌తో కాలిపోయింది. విషయం తెలుసుకున్న హరీశ్‌రావు ఆయన కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయం కింద రూ. 20వేలు ఆర్థిక సాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అపద వస్తే పార్టీలు చూసేది లేదని ప్రజల క్షేమమే ముఖ్యమన్నారు. ప్రభుత్వం నుంచి సాయాన్ని అందించేందుకు కృషి చేస్తానన్నారు.
దీపావళి
శుభాకాంక్షలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే హరీశ్‌రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగా దీపావళి అన్నారు. దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి అని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ కార్యకర్తకు ఎమ్మెల్యే హరీశ్‌రావు సాయం