
270 కేంద్రాలు ప్రారంభించాం
జిల్లాలో నేటి వరకు 270 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. 179 ఐకేపీ, 91 ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మిగతా కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు 105 టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉంది. ఆందుకు అనుగుణంగా 53 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచడం జరిగింది. కొనుగోలుకు ఇబ్బంది కలుగకుండా తేమ శాతం 17 ఉండేలా ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేస్తాం.
– ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్