
రక్తదానం సామాజిక బాధ్యత
కలెక్టర్ హైమావతి
సిద్దిపేటఎడ్యుకేషన్: ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుందని కలెక్టర్ హైమావతి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, రెడ్ రిబ్బన్ క్లబ్‌ల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధు లు ప్రభలుతున్న ప్రస్తుత తరుణంలో రక్తదానం చేస్తూ విద్యార్థులు మానవీయతను, సామాజిక స్ఫూర్తిని చాటుతున్నారన్నారు. అభినందించారు. రక్తదానం ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత కావాలన్నారు. ఆదిశగా విద్యార్థులు, అధ్యాపకులు ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ శిబిరంలో 30 మందికి పైగా రక్తదానం చేశారు. కార్యక్రమ నిర్వాహకులను, రక్త దానం చేసిన వారిని కలెక్టర్ అభినందించి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపా ల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం అధికారులు, అయా విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.