
ఆస్పత్రి వెనుక డోర్ సైతం సీజ్
ఆర్‌ఎంపీ వైద్యుడిపై పీఎస్‌లో మరోమారు ఫిర్యాదు
కొండపాక(గజ్వేల్): కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆస్పత్రి వెనుక డోర్ నుంచి వైద్య చికిత్సలు చేస్తున్న ఆర్‌ఎంపీ వైద్యుడిపై అధికారులు చర్యలు చేపట్టారు. ‘కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్’ అనే శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆర్‌ఎంపీ వైద్యుడి తీరుపై కలెక్టర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. దీంతో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్ మండల రెవెన్యూ అధికారి సత్యనారాయణతో వెళ్లి ఆస్పత్రి వెనక ఉన్న డోర్‌ను సీజ్ చేశారు. ఆర్‌ఎంపీ వైద్యుడు సుదర్శన్‌పై మరోమారు కుకునూరుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తెలిపారు.