‘ఫుట్‌బాల్‌’ సంగ్రామం | - | Sakshi
Sakshi News home page

‘ఫుట్‌బాల్‌’ సంగ్రామం

Jul 21 2025 8:07 AM | Updated on Jul 21 2025 8:07 AM

‘ఫుట్

‘ఫుట్‌బాల్‌’ సంగ్రామం

ముస్తాబైన నవోదయం
● నేటి నుంచి మూడు రోజులపాటు పోటీలు ● జాతీయస్థాయి మెగాటోర్నీకి వర్గల్‌ సర్వసన్నద్ధం ● సత్తాచాటనున్న వివిధ రాష్ట్రాల నవోదయ క్రీడాకారులు

వర్గల్‌(గజ్వేల్‌): పరుగులో చిరుత వేగం.. ప్రత్యర్థి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ బంతిని కాళ్ల మధ్య గింగిర్లు తీయిస్తూ.. గోల్‌ పోస్టు వైపు దూసుకెళ్తూ.. పెనాల్టీ కార్నర్లు.. పెనాల్టీ షూటవుట్‌లు.. అరుప లు, కేరింతలతో క్రీడాకారులు మూడురోజులపాటు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నారు. ఇందుకు వర్గల్‌ నవోదయ వేదికకానుంది. జాతీయ ఫుట్‌బాల్‌ సంగ్రామానికి వర్గల్‌ నవోదయ సర్వసన్నద్ధమైంది. అత్యుత్తమ విద్యతోపాటు క్రీడలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్న స్థానిక నవోదయ వేదికగా సోమవారం నుంచి 3 రోజుల పాటు జరిగే టోర్నమెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో..

దేశంలోని అన్ని నవోదయ విద్యాలయాల ఫుట్‌బాల్‌ జట్ల క్రీడాకారులు ఆయా ప్రాంత రీజియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. 8 రీజియన్ల నుంచి అండర్‌–15 విభాగంలో ఒక జట్టు, అండర్‌–17 విభాగంలో మరో జట్టుగా మొత్తం 16 జట్లు టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్‌–ఏ, గ్రూప్‌–బీ గా జట్లను విభజించి లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. టోర్నీలో విజేత జట్లు నవోదయ విద్యాలయాలన్నిటికి (నవోదయ ఒక రాష్ట్రంగా) ప్రాతినిధ్యంగా ‘ప్రీ–సుబ్రతో’ జాతీయ టోర్నీకి ఎంపికవుతారు. వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 253 మంది క్రీడాకారులు, 32 మంది ఎస్కార్ట్‌ టీచర్లు వర్గల్‌కు చేరుకున్నారు.

సందడిగా రిహార్సల్స్‌

వివిధ రీజియన్ల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, ఎస్కార్ట్‌ టీచర్లతో వర్గల్‌ నవోదయ సందడిగా మారింది. స్టేడియంలో మార్చ్‌ఫాస్ట్‌, ఓత్‌ టేకింగ్‌, తదితర రిహార్సల్స్‌ కొనసాగాయి. ప్రిన్సిపాల్‌ రాజేందర్‌ పర్యవేక్షణలో నవోదయ యంత్రాంగం తగు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ప్రతిష్టాత్మకంగా టోర్నమెంట్‌

క్లస్టర్‌, రీజినల్‌, జాతీయ టోర్నీలు సమర్థంగా నిర్వహించిన అనుభవం వర్గల్‌ నవోదయకు ఉంది. ప్రీ–సుబ్రతో జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహణ అవకాశం మాకు దక్కడం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. ఫిజికల్‌ టీచర్లు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ అందరి సహకారంతో టోర్నీ జయప్రదం చేస్తాం. నిష్ణాతులైన రెఫరీలతో పోటీలు నిర్వహిస్తున్నాం. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటుతూ పోటీలలో పాల్గొనాలి.

– దాసి రాజేందర్‌, ప్రిన్సిపాల్‌

నేడు టోర్నీ ప్రారంభోత్సవం

వర్గల్‌ నవోదయ వేదికగా ప్రీ–సుబ్రతో ఫుట్‌బాల్‌ జాతీయ పోటీలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ముఖ్యఅతిథిగా ఫుట్‌బాల్‌ అంతర్జాతీయ క్రీడాకారుడు, తెలంగాణ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జీపీ ఫల్గుణ, ప్రత్యేక ఆహ్వానితులుగా నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమీషనర్‌ అభిజిత్‌ బేరా హాజరవుతున్నారు.

‘ఫుట్‌బాల్‌’ సంగ్రామం 1
1/3

‘ఫుట్‌బాల్‌’ సంగ్రామం

‘ఫుట్‌బాల్‌’ సంగ్రామం 2
2/3

‘ఫుట్‌బాల్‌’ సంగ్రామం

‘ఫుట్‌బాల్‌’ సంగ్రామం 3
3/3

‘ఫుట్‌బాల్‌’ సంగ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement