
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025
ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం జిల్లా వ్యాప్తంగా బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే అమ్మవార్ల ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. బోనాలతో తరలివచ్చి నైవేద్యాలు తల్లికి సమర్పించారు. జిల్లా కేంద్రంలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పోతరాజులు, శివసత్తులు, జోగినిలు, కళాకారుల విన్యాసాలు భక్తులను విశేషంగా అలరించాయి. రోడ్డు పొడవునా కళాకారులు నెత్తిన బోనాలతో, కోలాటం ఆడారు. దీంతో జిల్లా కేంద్రం భక్తిపారవశ్యంతో, అమ్మవార్ల నామస్మరణతో మార్మోగింది.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
బోనంతో బైలెల్లి.. తల్లికి ప్రణమిల్లి
న్యూస్‌రీల్

సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025