
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తుల రాకతో కిట కిటలాడింది. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగాయి. క్షేత్రానికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు, పట్నాలు, అర్చన, ఒడి బియ్యం, గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఆలయ ఈఓ అన్నపూర్ణ, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ఆలయ ధర్మకర్తలు పర్యవేక్షించారు.
స్కాన్ చెయ్..
కానుక వెయ్
కొమురవెల్లి(సిద్దిపేట): గుడికొచ్చాం.. దేవుడిని దర్శించుకున్నాం.. అయ్యో హుండీలో వేసేందుకు చిల్లర లేదే.. అని జేబులు తడుముకోవాల్సిన అవసరం లేదంటున్నారు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అధికారులు. ప్రతి చిన్న అవసరానికి ఫోన్‌పే, గూగుల్‌పే, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా డిజిటల్ చెల్లిస్తున్న కాలమిది. అందుకు అనుగుణంగా భక్తుల కోసం ‘ఈ హుండీ’ని ఆదివారం ఈఓ అన్నపూర్ణ ప్రారంభించారు. బుకింగ్ కార్యాలయం, ప్రసాద విక్రయాల వద్ద, ఆన్నదాన సత్రంలలో క్యూఆర్ కోడ్ స్కానర్లను అమర్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త జయప్రకాశ్‌రెడ్డి రూ.10,116 స్కాన్ చేశారు.
ఎల్లమ్మ సన్నిధిలో
జడ్జి సాయికుమార్
దుబ్బాక: మండలంలోని పెద్దగుండవెల్లి ఎల్లమ్మతల్లిని ఆదివారం సిద్దిపేట సివిల్‌కోర్టు జడ్జి సాయికుమార్ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జడ్జికి అమ్మవారి జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో ఆలయం చైర్మన్ ఏల్పుల మహేష్, మల్లుగారి ప్రభాకర్, న్యాయవాది ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి