
ఇందిరమ్మ ఇళ్లపై నిబంధనలు సరికావు
గజ్వేల్: ఇందిరమ్మ ఇళ్లపై నిబంధనలు సరికావని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మల్లం సుమతి, మాజీ ఉపసర్పంచ్ మల్లేష్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ సత్తయ్యగౌడ్ తదితరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రఘునందన్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు 60 గజాలు మాత్రమే ఉండాలని, పైన ఇంకో ఇల్లు కట్టుకోకూడదనే విధానాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు వారి అనుయాయులకే ఇళ్లు మంజూరు చేయించుకుంటున్నారని ఆరోపించారు. బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత రాష్ట్ర కేబినెట్‌లో 50శాతం పదవులు వారికి కేటాయించాలని ఎంపీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లులో మతపరమైన రిజర్వేషన్లను తొలగిస్తే 42శాతం బీసీ రిజర్వేషన్లను ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ఇప్పటికే అన్ని రకాల పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని స్పష్టం చేశారు. గజ్వేల్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే మొత్తం నిధులను సమకూర్చిందని గుర్తు చేశారు. అదే విధంగా సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో యూజీడీల నిర్మాణాలకు సైతం నిధులను మంజూరు చేసిందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, కార్యకర్తలు, నాయకులకు ఎంపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లు రాంరెడ్డి, నలగామ శ్రీనివాస్, వెంకటరమణ, సింగం సత్తయ్య, మల్లేశం, గజ్వేల్ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్, మండలశాఖ అధ్యక్షుడు అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
బీజేపీలో పలువురి చేరిక