
జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా ధనరాజ్
సిద్దిపేటకమాన్: జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా ఏడీపీహెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ ధనరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు మెదక్, సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా విధులు నిర్వహించిన పల్వన్‌కుమార్‌ను రిలీవ్ చేశారు. నూతన డీఎంహెచ్‌ఓ గురువారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
ఇళ్ల నిర్మాణాలను
వేగిరం చేయాలి
జెడ్పీ సీఈఓ రమేశ్
మద్దూరు(హుస్నాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ రమేశ్ అన్నారు. బుధవారం నర్సాయిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు మంజూరైన వారు వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాంమోహన్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పోచమ్మ ఆలయ
అభివృద్ధికి సహకరిస్తాం
దుబ్బాక: పట్టణంలోని పోచమ్మ ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నగరంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యను కలిశారు. వందల ఏళ్ల క్రితం నిర్మించిన పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం చేసేందుకు సహకరించాలని వారిని కోరారు. దీంతో వారు స్పందిస్తూ.. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కమటీ సభ్యులు తెలిపారు.
పరశురాములుకు
కార్మిక రత్న అవార్డు
దుబ్బాకటౌన్: మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన పరశురాములు కార్మిక రత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డు కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 5న తిరుపతిలో జరిగే బహుజన సాహిత్య అకాడమి నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డు అందజేయనున్నారు. బుధవారం హైదరాబాద్‌లో అకాడమి జాతీయ కార్యాలయంలో సెలక్షన్ కమిటీ చైర్మన్ నల్ల రాధాకృష్ణ ఆహ్వానపత్రాన్ని పరశురాములకు అందజేశారు.
రిజర్వాయర్ నుంచి
చెరువులు నింపండి
సీపీఎం జిల్లా కార్యదర్శి శశిధర్
కొండపాక(గజ్వేల్): తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని చెరువులు నింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెలికట్టలో బుధవారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ చెరువుల్లోకి చుక్క నీరు చేరలేదన్నారు. మరోవైపు వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నాన్నారు. తలాపునే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ప్రభుత్వం చెరువులకు నీరు వచ్చే ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పార్టీల కతీతంగా అర్హులకు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి బాల్‌నర్సయ్య, నాయకులు మల్లేశం, లింగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్ సీఐగా రవికుమార్
గజ్వేల్‌రూరల్:నూతన సీఐగా రవికుమార్ బదిలీపై బుధవారం గజ్వేల్‌కు వచ్చారు. ఇదివరకు ఇక్కడ సీఐగా పనిచేసిన బి.సైదా హైదరాబాద్‌లోని ఐజీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. నిజామాబాద్ కమిషనరేట్‌లోని సీసీఎస్‌లో పనిచేస్తున్న రవికుమార్‌ను గజ్వేల్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా ధనరాజ్

జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా ధనరాజ్