
అదనపు కలెక్టర్‌ను కలిసిన కొమురవెల్లి అర్చకులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో అర్చకులు సోమవారం అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామి వారి ప్రసాదాన్ని అందించారు. అదనపు కలెక్టర్ కలిసిన వారిలో జిల్లా దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, స్థానచార్యులు మల్లయ్య, నాచారం లక్ష్మీనర్సింహస్వామి, అర్చకులు తీగుళ్ల గోపికృష్ణ, మనోహర్, బసవేశ్వర్ తదితరులు ఉన్నారు.
‘పాయమాలు’ ఆవిష్కరణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన రచయిత ఐత చంద్రయ్య రచించిన పాయమాలు కథల సంపుటి పుస్తకావిష్కరణ సోమవారం నగరంలో జరిగినట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. కథల సంపుటిని ముదిగొండ శివప్రసాద్, ఓలేటి పార్వతీశం, వడ్డి విజయసారథి, ఆంజనేయరాజులు ఆవిష్కరించారన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఎన్నవెల్లి రాజమౌళి, లక్ష్మయ్య, బస్వరాజ్ కుమార్, పరశురాములు, సుధాకర్ తదితరులు అభినందనలు తెలిపారు.
ఎస్సీలకు న్యాయం చేయండి
మంత్రులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్
చైర్మన్ విజ్ఞప్తి
దుబ్బాక: పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. ఈ మేరకు సోమవారం నగరంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌లను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల కులగణన సర్వే ప్రకారం పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్‌ను కల్పించాలని మంత్రులను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు వారు సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో తనతో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్, కమిషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.
నిరుద్యోగుల నుంచిదరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేటరూరల్: నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ తెలంగాణ (డీట్) పోర్టల్ ద్వారా వివిధ పరిశ్రమల్లో ఖాళీగా ఉన్న 160 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహానిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఎగ్జిక్యూటివ్‌విజువల్ ఇన్‌స్పెక్టర్, ఆర్‌ఏడీ, క్యూసి, క్యూఏ, ట్రైనీ వంటి పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికై ఐటీఐ, ఇంటర్, బీటెక్, బిఫార్మసి, ఎంఫార్మసి, బీఎస్సీ, కెమిస్ట్రి, మైక్రోబయోలజీ ప్రత్యేక సబ్జెక్టుగా ఉండి డిగ్రీ, పీజి చదివినవారు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు డీట్ పోర్టల్ www.deet.telangana.gov.inలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9281423575 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
దివ్యాంగులకుఇచ్చిన హామీ ఏమాయె
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగులకు రూ.6,016 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంత వరకు అమలు చేయడంలేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజుమాదిగ అన్నారు. సోమవారం దుబ్బాకలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా దివ్యాంగులకు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు మేనిఫెస్టోలో ప్రకారం పెన్షన్లు పెంచకపోవడం దారుణమన్నారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈ నెల 16న సిద్దిపేటలో జరిగే మహాసభకు మంద కృష్ణమాదిగ హాజరవుతున్నారన్నారు. దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు జోగయ్య, మహేష్, రాజేశ్వరరావు, కనకరాజు తదితరులు ఉన్నారు.

అదనపు కలెక్టర్‌ను కలిసిన కొమురవెల్లి అర్చకులు