
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటేనే సమాజంపై మంచి అవగాహన కలుగుతుందని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అర్చన ప్రియదర్శిని అన్నారు. మిరుదొడ్డి తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఇటీవల నిర్వహించిన మాక్ పోలింగ్‌లో గెలుపొందిన విజేతల చేత సోమవారం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుతో పాటు ఆట పాటలు, నైతిక విలువలు, క్రమ శిక్షణలో విద్యార్థులందరికీ మాక్ పోలింగ్‌లో గెలుపొందిన విజేతలు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తోటి విద్యార్థులందరికీ ప్రాతి నిధ్యం వహించే అవకాశాన్ని జవాబుదారీ తనంతో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో టీచర్లు అంజుమ్, నాగరత్న, రాజేశ్వరి, అనురాధ, దేవేందర్‌తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.