
బూర్గుపల్లి పాఠశాలలో ‘అల్పాహార సేవ’
గజ్వేల్: సత్యసాయి సేవా సమితి సేవలు అభినందనీయమని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ‘అల్పాహార సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి సేవాసమితి సేవలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మరోవైపు గుండె జబ్బుల బారిన పడుతున్న చిన్నారులకు పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేయించి వారిని కాపాడుతున్న ఘనత ఈ సంస్థకే దక్కిందన్నారు. బూర్గుపల్లి పాఠశాలలో విద్యార్థులకు నిరంతర ‘అల్పాహార సేవా’ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ, పాఠశాల హెచ్‌ఎం పాపిరెడ్డి, దాత బాల్‌నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.