
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కల్లుగీత సంఘం జిల్లా కార్యదర్శి అరుణ్‌గౌడ్ మాట్లాడుతూ ఎంతో ప్రమాదకరమైన వృత్తి అయినా వృత్తిని నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో చాలా మంది కార్మికులు ప్రమాదాలకు గురైనప్పటికీ ఎక్స్‌గ్రేషియా అందించడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం గీతకార్మికులకు, వారి కుటుంబాలకు రావాల్సిన పరిహారాన్ని అందించాలన్నారు.