
‘ఆపన్నహస్తం’ సేవలు
లోక్‌సత్తా ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్‌రావు
గజ్వేల్: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ‘ఆపన్నహస్త మిత్రబృందం’సేవలు అభినందనీయమని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. గజ్వేల్‌లో శనివారం నిర్వహించిన ఆపన్నహస్త మిత్రబృందం కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...2017లో ఏర్పడిన ఆపన్నహస్త మిత్రబృందం ఇప్పటివరకు 106 సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మరెన్నో సంఘాలకు ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సరస్వతి శిశుమందిర్ ప్రధానాచార్యులు హరిణాపవన్, జాతీయ యువజన అవార్డుగ్రహీత దేశబోయిన నర్సింహులు, ఆపన్నహస్త మిత్రబృందం అధ్యక్షుడు బాల్‌చంద్రం, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్యామ్‌ప్రసాద్, సహాయ కార్యదర్శి స్వామితో పాటు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.