
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
ఎంపీ రఘునందన్‌రావు సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక
గజ్వేల్: బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ఎంపీ రఘునందన్‌రావు సూచించారు. పలువురు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు శనివారం ఎంపీ రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లోని ఎంపీ రఘునందన్‌రావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని సూచించారు. బీజేపీలో చేరిన వారిలో సిద్ది నవీన్, శ్రీవర్ధన్, యాదగిరి, గోపి తదితరులున్నారు.