
‘మహిళాశక్తి’ సంబరాలు నిర్వహించండి
వర్గల్(గజ్వేల్): ఊరూరా ఇందిరా మహిళాశక్తి సంబరాలు ఘనంగా నిర్వహించాలని సెర్ప్ సంస్థాగత నిర్మాణ విభాగం హైదరాబాద్ ప్రధాన కార్యాలయ ప్రాజెక్ట్ మేనేజర్ భారతి అన్నారు. సంబరాలలో స్వయం సహాయక మహిళల ఆర్థికాభ్యున్నతి, సంఘాల పురోగతి, జీవనోపాదులు, బీమా సౌకర్యం, లబ్ధిపొందిన కుటుంబాలు తదితర అంశాలను చర్చించాలన్నారు. మంగళవారం మండల కేంద్రం వర్గల్ ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం ఆనంద్‌కుమార్ పర్యవేక్షణలో ఇందిరా మహిళాశక్తి సంబరాలలో భాగంగా మండల సమాఖ్య అధ్యక్షురాలు రేణుక అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం నుంచి ప్రతిగ్రామంలో సంబురాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సహకారం, బ్యాంకు లింకేజీ రుణాలు, ఆర్థిక పురోగతిని చర్చించుకోవాలన్నారు. సంఘాలలో లేనివారిని చేర్పించాలని, ప్రతి సభ్యురాలికి బ్యాంకు లింకేజీ ద్వారా రుణ మంజూరు చేసి జీవనోపాదులు కల్పించాలన్నారు. మండలంలో జీవనోపాదులు బాగున్నాయని కితాబునిచ్చారు. స్కూల్ డ్రెస్సులను ఎస్‌హెచ్‌జీ మహిళలతో కుట్టించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గ్రామ సంఘాల అధ్యక్షులు, అసిస్టెంట్లు, సీసీలు సత్యం, నర్సింలు, సుభాష్‌గౌడ్, రమేష్, పద్మలత, భాస్కర్, లత, విష్ణు పాల్గొన్నారు.
సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ భారతి