
జనహృదయ నాయకుడు వైఎస్సార్
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రజల మనిషి డాక్టర్ వైఎస్సార్ అని యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ అన్నారు. మంగళవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపికృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు వహబ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొమ్మల ప్రవీణ్, ఎర్రం మహేందర్, చెంది శ్రీనివాస్ ముదిరాజ్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అజ్మత్, వర్కింగ్ ప్రెసిడెంట్ రషాద్, నియోజకవర్గ అధ్యక్షులు బడికోల్ రాకేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు సాదుల సాయి ప్రతాప్, యూత్ కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షుడు అనిల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మత్ అలీ, కర్ర మధు, తదితరులు పాల్గొన్నారు.