
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు
డీపీఎం విద్యాసాగర్
అక్కన్నపేట(హుస్నాబాద్): మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందజేస్తోందని డీపీఎం విద్యాసాగర్ అన్నారు. మండల కేంద్రంలో స్వయం భూ రాజరాజేశ్వర మండల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాల్లో లేని మహిళలను గుర్తించి కొత్త సంఘాలుగా ఏర్పాటు చేయాలన్నారు. లోనూ భీమా, ప్రమాద బీమా, మహిళా శక్తి అంశాలైన తదితర వాటిపై అవగాహన కల్పించారు. సంఘాలకు బ్యాంక్ ద్వారా లింక్ చేయించడం, అందరూ రక్తహీనత లేకుండా మూడు నెలకొసారి ప్రతి మహిళ రక్త పరీక్షలు నిర్వహించడం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ జ్యోష్ణ, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు పాల్గొన్నారు.