మెరుగుబడినాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

మెరుగుబడినాయ్‌..

Jun 30 2025 7:42 AM | Updated on Jun 30 2025 7:42 AM

మెరుగుబడినాయ్‌..

మెరుగుబడినాయ్‌..

సిద్దిపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల

ప్రభుత్వ పాఠశాలల

పనితీరు మెరుగు

కేంద్ర విద్యా శాఖ

తాజా నివేదిక విడుదల

రాష్ట్రంలో సిద్దిపేటకు 4వ,

సంగారెడ్డికి 8, మెదక్‌కు 25వ ర్యాంక్‌

భ్యసన ఫలితాలు, చదువుల నాణ్యత, మౌలిక వసతులు, డిజిటల్‌ లెర్నింగ్‌, అందుబాటులో బడులు–పిల్లల రక్షణ, విద్యాపరిపాలన విభాగాల్లో 74 సూచికలను పరిగణనలోకి తీసుకుని 600 మార్కులకు గ్రేడింగ్‌ ఇచ్చారు. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా 2023–24లో రాష్ట్రంలో సిద్దిపేట 276 మార్కులతో 4వ, సంగారెడ్డి 268 మార్కులతో 8వ, మెదక్‌ 244 మార్కులతో 25వ ర్యాంక్‌లు సాధించాయి. 2022–23లో ప్రశిష్ట మూడవ కేటగిరిలో ఉండగా 2023–24లో రెండవ కేటగిరిలోకి అప్‌గ్రేడ్‌ అయ్యాయి.

డిజిటల్‌ లెర్నింగ్‌లో వెనుకబాటు

డిజిటల్‌ లెర్నింగ్‌లో ప్రభుత్వ బడులు వెనుకబాటులో ఉన్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. పలు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నప్పటికీ ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పలు పాఠశాలలో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేసి బోధిస్తున్నారు. పాఠ్యంశాలు డిజిటల్‌ బోధన అందడం లేదు. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్‌ బోధన అందిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు పలు పాఠ్యంశాలు క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే కళ్ల ముందు కదలాడుతూ బోధిస్తుంది. ఇలా విద్యా వ్యవస్థల్లో మార్పులు తీసుకవస్తే మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. అభ్యసన ఫలితాలు గతంతో పోలిస్తే మెరుగుపడి సిద్దిపేట, సంగారెడ్డి వంద మార్కులు దాటాయి. మెదక్‌ జిల్లా వందలోపే మార్కులు వచ్చాయి.

బడులు అందుబాటులో లేక..

అందుబాటులో బడులు– పిల్లల రక్షణ విభాగంలోనూ ఉమ్మడి మెదక్‌ జిల్లా వెనుకబడ్డాయి. పలు చోట్ల ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో దాదాపు రెండు నుంచి ఐదు కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆ కేటగిరిలో 35 మార్కులకు గాను మెదక్‌ జిల్లాకు 9, సిద్దిపేటకు 15, సంగారెడ్డికి 14 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయటంలో ఈ రెండు విభాగాలు కీలకమవటంతో వీటిల్లో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా జిల్లా యంత్రాంగాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు గతంతో పోలిస్తే మెరుగుపడింది. కేంద్ర విద్యాశాఖ 2023–24 పెర్ఫార్మింగ్‌ గ్రేడ్‌ ఇండక్స్‌(పీజీఐ) నివేదికను ఇటీవల విడుదల చేసింది. దీని ప్రకారం 2022–23 కంటే పుంజుకున్నాయి. సర్కారు బడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. దీంతో మెరుగు పడుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 3,105 ప్రభుత్వ పాఠశాలలో 1.80లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

– సాక్షి, సిద్దిపేట

2023–24లో మార్కులు ఇలా..

జిల్లా అభ్యసన చదువుల మౌలిక డిజిటల్‌ అందుబాటులో విద్యా పరిపాలన

ఫలితాలు నాణ్యత వసతులు లెర్నింగ్‌ బడులు–పిల్లల రక్షణ

మెదక్‌ 97 43 29 10 09 56

సిద్దిపేట 110 51 29 16 15 55

సంగారెడ్డి 120 43 28 11 14 53

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement