
3వ రోజుకు చేరిన సైకిల్‌యాత్ర
గజ్వేల్‌రూరల్: హుస్నాబాద్ పేరును భార్గవపురంగా మార్చాలని సామాజిక ఉద్యమకారుడు పిడిశెట్టి రాజు కోరారు. ఈ మేరకు చేపట్టిన సైకిల్‌యాత్ర 3వ రోజు గజ్వేల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలంలో తమ గ్రామం పేరు భార్గవపురంగా ఉండేదని, శ్రీరేణుకాదేవి(ఎల్లమ్మతల్లి) కుమారుడైన భార్గవరాముడు(పర్శరాముడు) పేరున భార్గవపురం అని పేరు వచ్చినట్లు తెలిపారు. నిజాంల కాలంలో గ్రామం పేరును హుస్నాబాద్‌గా మార్చారని, గ్రామ మూలాలు మరచిపోకుండా ఉండాలనేదే తమ ఉద్దేశమన్నారు. పేరు మార్చాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చే వరకు సైకిల్‌యాత్ర కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

3వ రోజుకు చేరిన సైకిల్‌యాత్ర