
దరఖాస్తుల ఆహ్వానం
బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజమ్మ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు, అందుకు దరఖాస్తులను అహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజమ్మ తెలిపారు. హైదరాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈ శిక్షణ తరగతులు జూలై 27 నుంచి అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు జూలై 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. జూలై 12న నిర్వహించే ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు చేసుకోండి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, ఆదర్శ, కేజీబీవీలు, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూలై 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసిన ఫారంలను జూలై 15లోగా జిల్లా విద్యాశాఖ అధాకారి కార్యాలయంలో అందించాలన్నారు.
లక్కీ డ్రా పద్ధతిలో
సీట్ల ఎంపిక...
సిద్దిపేటరూరల్: 2025–26 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారిని విద్యార్థుల ఎంపిక డ్రా నిర్వహించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఎంపిక చేసిన ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందిస్తామన్నారు. విద్యార్థులను డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తామని, వారిని సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లలోని ఎంపిక చేసిన స్కూల్‌లలో వసతితో కూడిన ఉచిత విద్యను అందిస్తామని ఆమె వివరించారు. ఒకటో తరగతికి 225 మంది దరఖాస్తు చేసుకోగా.. 87 విద్యార్ధులను ఎంపిక చేశారు. 5 తరగతికి 132 విద్యార్ధులకుగాను 89 మంది విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి కవిత, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి
20మంది ఎంపిక
సిద్దిపేటజోన్: జూలై 1 ,2వ తేదీల్లో హకీంపేట క్రీడాపాఠశాల రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలకు సిద్దిపేట జిల్లా నుంచి 18 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 24న సిద్దిపేట గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో క్రీడా పాఠశాలల్లో నాల్గవ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లా స్థాయిలో ఎంపిక నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి ఎంపిక చేసినట్టు తెలిపారు. బాలుర విభాగంలో ఆత్రేయ, రేవంత్ నాయక్, విశ్వాన్, శ్రేయన్, అక్షిత్, అభినవ్, చరణ్, సుస్వాంత్, రక్షిత్ కుమార్, మనిత్‌లు బాలికల విభాగంలో ప్రనిషి, వేద సహిత, దేవాన్సీ, హర్షిత, గాయత్రి, రష్మిత, చరిష్మా, కృతికలు ఎంపికయ్యారన్నారు. ఎంపిక అయిన వారు జూలై ఒకటిన ఉదయం10 గంటలకు స్టేడియం ప్రాంగణంలో సంబంధించిన పత్రాలతో హాజరుకావాలని సూచించారు.
ఇంజినీరింగ్‌లో ఉచిత శిక్షణ
గజ్వేల్‌రూరల్: సత్యసాయి స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో డేటా ఇంజినీర్ కోర్సులో యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు భగవాన్ శ్రీసత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. గజ్వేల్‌లో శనివారం వారు మాట్లాడుతూ 2022–2025 మధ్య బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీ టెక్, ఎంటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసిన వారు ఈ శిక్షణలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లో ని సత్యసాయి స్కిల్ సెంటర్‌లో బేసిక్, అడ్వా న్స్‌డ్ పైథాన్, ఎస్‌క్యూఎల్, బీఐ టూల్స్‌తో పాటు సాఫ్ట్ స్కిల్స్‌లో 90 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు కల్పించడంలో సహకారం ఉంటుందని చెప్పారు. ఆసక్తి గలవారు 4లోగా www.rethu.aiలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 90523 72023 నంబరులో సంప్రదించాలని సూచించారు.