
లక్ష్యాలను సాధించాలి
సిద్దిపేటరూరల్: నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ కే.హైమవతి అధికారులను ఆదేశించారు. శనివారం వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో సమీక్షించారు. వారికి కేటాయించిన లక్ష్యాలపై సమాలోచన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖలు వారికి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆయిల్‌పాం సాగు పెరిగేలా రైతులను ప్రోత్సహించడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనులను అధికారులు పర్యవేక్షించాలని కోరారు. మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న పనులను జూలై 15వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలలో రైతులను ప్రోత్సహించాలని కోరారు. చివరగా ఉద్యాన దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఏఓ రాధిక, ఉద్యాన శాఖ అధికారి సువర్ణ, మత్స్య శాఖ అధికారి మల్లేశం, పశుసంవర్ధక శాఖ అధికారి కొండల్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి మొక్క బతకాలి
వనమహోత్సవ లక్ష్యాన్ని అధికారులు తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామపంచాయతీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ముందస్తు కార్యాచరణతో లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గుర్తించిన వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్నారు. సకాలంలో ఫర్టిలైజర్, నీటిని అందిస్తే మొక్కలు ఏపుగా పెరిగే ఆస్కారం ఉందన్నారు. పెట్టిన ప్రతి మొక్క బతకాలని, అధికారులు తరచూ పర్యవేక్షించాలని కోరారు. ఉద్యానవన శాఖలో 1,335 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటికి 428 రైతుల నుంచి 748 ఎకరాల్లో పలు రకాల తోటల పెంచేందుకు సిద్ధం చేశారని, ఆగస్టు లోపు పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడవచ్చని, బహిరంగ ప్రదేశాలలో చెత్త, డ్రైనేజీలు పొంగడం లాంటిది ఉన్నట్లయితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ–2025 గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో సీఈవో రమేష్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ దేవకీదేవి, పంచాయతీ రాజ్ ఈఈ లు శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ రైతులకు ప్రోత్సాహం
జూలై 15లోగా పెండింగ్ పనులు పూర్తి
కలెక్టర్ కె.హైమావతి
మాట్లాడుతున్న కలెక్టర్ హైమావతి