
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
అక్కన్నపేట(హుస్నాబాద్): మండల పరిధి పంతుల్‌తండా గ్రామ పరిధిలోని తారాచంద్‌తండాలో సోమవారం తాగునీటి కోసం గిరిజన మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీరు అందించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేదిలేక ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. వాగులో నీరులేకపోవడంతో ఉన్న బోరు నుంచి నీరు రావడంలేదన్నారు. మరోవైపు భగీరథ నీరు సరిగ్గా రాకపోవడంతో నిత్యం తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
ఖాళీ బిందెలతో నిరసన