
బదిలీలు, పదోన్నతుల కోసం కృషి
వర్గల్(గజ్వేల్): ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే సత్తా కలిగిన ఏకై క సంఘం పీఆర్‌టీయూ అని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. శనివారం మండల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన వర్గల్ మండలం గౌరారం ఫంక్షన్‌హాల్‌లో చౌదరిపల్లి జెడ్పీహైస్కూల్ హెచ్‌ఎం ఇటిక్యాల వెంకట్‌రెడ్డి ఉద్యోగ విరమణ సభకు ఆయన హాజరయ్యారు. వెంకట్‌రెడ్డి దంపతులకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రయోజనాలే లక్ష్యంగా 50 సంవత్సరాలుగా పీఆర్‌టీయూ కృషి చేస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు ఇప్పిస్తామని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసే విధంగా కృషి చేస్తామని, షరతులు లేకుండా అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం అందేలా హెల్త్ కార్డులు ఇప్పిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, దామోదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ఆదరాసుపల్లి శశిధర్‌శర్మ, ఎంఈఓ సునీత, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హామీ