
ప్రతిభకు పురస్కారం
సిద్దిపేటఅర్బన్: సీబీఎస్‌ఈ పదవ తరగతి ఫలితాల్లో హైదరాబాద్ రీజియన్ స్థాయిలో సిద్దిపేట కేంద్రీయ విద్యాలయం 5వ స్థానంలో నిలిచింది. 74 పాఠశాలలకు గాను సిద్దిపేట కేంద్రీయ విద్యాలయం ఐదో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రిన్సిపాళ్ల సమ్మేళనంలో పాఠశాల ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్ కేంద్రీయ విద్యాలయ సమితి కమిషనర్ విధి పాండే చేతులు మీదుగా బహుమతి, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ ఈ అవార్డు వెనుక సిద్దిపేట కేంద్రీయ విద్యాలయం నిలవడంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. అలాగే ఈ విద్యాసంవత్సరం 9వ తరగతిలో ఒక సీటు, పదవ తరగతిలో ఏడు సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. జూలై 10వ తేదీలోగా అర్హత కలిగిన విద్యార్థులు దరఖా స్తు చేసుకోవాలని, కేంద్రీయ విద్యాలయ మార్గదర్శకాల మేరకు సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.
కేంద్రీయ విద్యాలయానికి 5వ స్థానం