
కరవు జిల్లాగా ప్రకటించాలి
సిద్దిపేటఅర్బన్: జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కార్మిక, కర్షక భవన్‌లో సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా చుక్క రాములు హాజరై మాట్లాడారు. సాగు చేసే సమయంలో వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు మొలవక రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు ఎండిపోయి సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే జిల్లాను యూనిట్‌గా తీసుకొని కరవు జిల్లాగా ప్రకటించాలని కోరారు. కరవు నివారణ చర్యలు చేపట్టి నష్ట పరిహారం అందించాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్నాయని, పథకాలను పారదర్శకంగా అమలు చేసి నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, యాదగిరి, రవికుమార్, బాలనర్సయ్య, అరుణ్, శ్రీనివాస్, రవీందర్, శారద, శిరీష, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
చుక్కా రాములు