
అంధకారంలో డబుల్‌బెడ్రూంలు
వీధిలైట్లు వెలగక చిమ్మచీకట్లో డబుల్ బెడ్రూం కాలనీ
● కాలనీల్లో చిమ్మచీకట్లు
● వెలుగని వీధిలైట్లు
● ఎవరికీ పట్టడంలేదంటూ ప్రజల ఆవేదన
దుబ్బాక: పట్టణంలోని డబుల్ బెడ్రూం కాలనీల్లో వీధిలైట్లు వెలగక చిమ్మచీకట్లు అలుముకున్నాయి. కొన్ని రోజులుగా అంధాకారం నెలకొంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పట్టణంలోని బల్వంతాపూర్ రోడ్డులో నిర్మించిన 850 డబుల్ బెడ్రూంలలో నివసించే ప్రజలు సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలనీలోని 60, 61, 62 బ్లాక్‌లలో వీధిలైట్లు వెలుగక పోవడంతో చాలరోజులుగా రాత్రి అయ్యిందంటే చాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. కొన్ని బ్లాక్‌లలో వీధిలైట్లు రాత్రి, పగళ్లు నిరంతరం వెలుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.ఇప్పటికై న సంభందిత అధికారులు దృష్టి సారించి అంధకారంలో ఉన్న కాలనీల్లో వీధిలైట్లకు మరమ్మతులు చేయాలని డబు ల్ బెడ్రూం కాలనీ వాసులు కోరుతున్నారు.