కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరండి
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో బీటెక్ ఈసీఈ, సీఎస్‌ఈ, ఐటీ, ఏఐ కోర్సులు ప్రతీ విభాగంలో 60 సీట్లకు గాను మొత్తం 240 సీట్లు మంజూరు అయ్యాయన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మొదటి సంవత్సరం ప్రారంభమవుతున్న కళాశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. విద్యార్థులు కౌన్సెలింగ్‌లో ప్రథ మ ప్రాధాన్యతగా హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలకు ఆప్షన్ ఇవ్వాలని మంత్రి కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం
గజ్వేల్: మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. అక్కారం, బెజుగామ, పిడిచెడ్, ఆహ్మదీపూర్, శేర్‌పల్లి, కొల్గూర్, అనంతరావుపల్లి, దాచారం, బూర్గుపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులను త్వరగా పూర్తి చేసి, గృహ ప్రవేశాలకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ముగిసిన పాలిసెట్ కౌన్సెలింగ్
నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసం నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పాలిసెట్ కౌన్సెలింగ్ ముగిసిందని రాజగోపాల్‌పేట కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ చెప్పారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ డిప్లొమా ప్రవేశం కోసం నిర్వహించిన సర్టిఫికెట్ల పరీశీలనకు ఇప్పటి వరకు 700 మంది హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఐడీ, పాస్‌వర్డు అందజేశామని తెలిపారు. ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు పెట్టుకునేలా అవగాహన కల్పించామన్నారు. కౌన్సెలింగ్‌లో అభినవ్, షెహబాజ్, రాజు, రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, కవిత, శ్రీనివాస్, విజయ్‌కుమా ర్, రాజమౌళి, మధుబాబు పాల్గొన్నారు.

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి