కొత్త కలెక్టర్‌గా హైమావతి
సాక్షి, సిద్దిపేట: జిల్లా కలెక్టర్‌గా కే హైమావతి నియమితులయ్యారు. మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టర్‌గా మిక్కిలినేని మనుచౌదరి బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కే హైమావతి విధులు నిర్వర్తిస్తుండగా జిల్లాకు కలెక్టర్‌గా వస్తున్నారు.
15 నెలల పాటు జిల్లాకు సేవలు..
గతేడాది ఫిబ్రవరి 24న కలెక్టర్‌గా మనుచౌదరి బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 15 నెలల పాటు జిల్లాకు సేవలు అందించారు. సౌమ్యుడు, మృదు స్వభావిగా గుర్తింపు పొందారు. క్షేత్రస్థాయి సందర్శనలు.. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి అధికారులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేశారు. పాలనలో విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నిత్యం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ జిల్లాను అభివృద్ధి వైపు తీసుకెళ్లారు. కలెక్టర్‌గా బాధ్యతలు తొలి జిల్లా అయినప్పటికీ యంత్రాంగాన్ని సమర్థంగా నడిపించారు.
మనుచౌదరి బదిలీ.. నిత్యం ప్రజలతో మమేకమై పని చేసిన మిక్కిలినేని


