నర్సాపూర్: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతుగా సహాయం చేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి. తన మిత్రుడు హకీం ఇచ్చిన సూచన మేరకు నియోజకవర్గంలో జరిగే ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందజేయాలని నిర్ణయించారు. సుమారు 12 ఏళ్ల క్రితం అమలులో పెట్టారు. అయితే వాటిని అందజేసే సమయంలో ప్రచారం కోసం ఆరాటపడటం లేదు. ఇప్పటివరకు సుమారు 2,500 మంది ఆడపిల్లలకు రఘువీరారెడ్డి పుస్తె మెట్టెలు అందజేశారు. శక్తి ఉన్నంత వరకు పేద కుటుంబాలకు అండగా నిలుస్తానని అన్నారు. గతంలో ఒక ఆడ కూతురుకు పుస్తె మెట్టెలు ఇవ్వడానికి రూ. 8 వేల వరకు ఖర్చు కాగా, ప్రస్తుతం రూ. పది వేలు అవుతున్నాయని చెప్పారు. కులమతాలకు అతీతంగా పేద వారికి సహాయం చేయడమే తన లక్ష్యమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.