మహిళలు మానవాళికి దిక్సూచి | - | Sakshi
Sakshi News home page

మహిళలు మానవాళికి దిక్సూచి

Published Sat, Mar 8 2025 7:56 AM | Last Updated on Sat, Mar 8 2025 7:56 AM

మహిళలు మానవాళికి దిక్సూచి

మహిళలు మానవాళికి దిక్సూచి

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: మహిళలు మానవాళికి దిక్సూచి అని, జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్‌) ఎన్‌సీసీ యూనిట్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలు అన్ని రకాలుగా స్వేచ్ఛగా ఉండాలన్నారు. ఎన్‌సీసీ ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. అనంతరం గరిమా అగర్వాల్‌ను సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సునీత, ఎన్‌సీసీ కేర్‌ టేకర్‌ కృష్ణయ్య, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ గోపాల సుదర్శనం, డాక్టర్‌ మామిద్యాల శ్రీనివాస్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

హుస్నాబాద్‌రూరల్‌: పట్టణ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలో సుందరీకరణ పనులకు సంబంధించి శుక్రవారం అధికారుల చేత కొలతలు చేయించారు. అభివృద్ధి పనులు ఎక్కడా అసంపూర్తిగా లేకుండా కమిషనర్‌ చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయం పాఠశాలను తనిఖీ చేశారు. హాస్టల్‌లోని సరుకులను పరిశీలించారు. నాణ్యత లేని వంట సరుకులను ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయరాదన్నారు. ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు బాగా రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలయ అభివృద్ధి పై ఈఓ కిషన్‌రావును అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్‌ వెంట మండల ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, కమిషనర్‌ మల్లికార్జున్‌, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, డీఎల్పీఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ మనీల ఉన్నారు.

జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement