దుబ్బాకరూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సిద్దిపేట మండలం తోర్నాల బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేశ్‌తెలిపిన వివరాల ప్రకారం... దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన బైతి చంద్రయ్య(65) ద్విచక్ర వాహనంపై తన కూతురు వద్దకు ఇర్కోడ్ గ్రామానికి వెళ్తున్నాడు. మెదక్ నుంచి సిద్దిపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు తోర్నాల బస్టాండ్ వద్ద ఆగి ప్యాసింజర్‌ను దింపుతుంది. ఈ క్రమంలో చంద్రయ్య అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి తన ద్విచక్ర వాహనంతో ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో మృతి చెందాడు.


