పాలన సదా ‘మామూలే’ | - | Sakshi
Sakshi News home page

పాలన సదా ‘మామూలే’

Mar 16 2026 8:57 AM | Updated on Mar 16 2026 8:57 AM

● షాపుల ముందు పార్కింగ్‌ స్థలాలు కరువు ● పట్టణంలో సెట్‌ బ్యాక్‌లకు మంగళం ● రోడ్లను అక్రమించి అక్రమ కట్టడాలు వ్యాపారాలు

● షాపుల ముందు పార్కింగ్‌ స్థలాలు కరువు ● పట్టణంలో సెట్‌ బ్యాక్‌లకు మంగళం ● రోడ్లను అక్రమించి అక్రమ కట్టడాలు వ్యాపారాలు

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే మున్సిపల్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. టీఎస్‌–బీపాస్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే వారికి నోటీసులు జారీ చేస్తాం.

–మున్సిపల్‌ కమిషనర్‌ శివాజీ

అధికారుల తీరుతో టౌన్‌ ప్లానింగ్‌ అస్తవ్యస్తం

ఏళ్లు గడుస్తున్నా సదాశివపేట మున్సిపాలిటీ తీరు మాత్రం మారడం లేదు. ఏళ్లుగా అవినీతి అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. మున్సిపల్‌ యంత్రాంగం కాసుల వేటలో నిమగ్నమై ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తోంది. అక్రమ కట్టడాలకు అడ్డు లేకుండా పోవడంతోపాటు వాటిని నిర్మిస్తున్న యజమానుల నుంచి మూమూళ్లు కూడా వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో పట్టణంలో భవన నిర్మాణాలు గతంలో ఎన్నడూలేని విధంగా అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇష్టారాజ్యంగా అదనపు అంతస్థులు నిర్మిస్తున్నారు. పలుకుబడి ఉన్న వారి కట్టడాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనుమతులు ఒకదానికి తీసుకుంటూ నిర్మాణాలు మరోవిధంగా చేపడుతున్నారు. చాలామంది పార్కింగ్‌లకు స్టెల్లార్లను వదిలి వేయకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపట్టి అద్దెలకిస్తున్నారు. పట్టణంలో అధికారికంగా 14,214 గృహాలు ఉండగా అనధికారికంగా మాత్రం వాటికి రెట్టింపుస్థాయిలో ఉన్నట్లు సమాచారం. ప్రధాన వ్యాపార కూడళ్లు సిద్ధాపూర్‌గౌని, సుభాష్‌రోడ్డు, శాసీ్త్రరోడ్డు, బుక్కకేరీ, పిట్టలకేరీ, సిద్దాపూర్‌రోడ్డు, ఎస్‌బీఐ బ్యాంకు నుంచి అయ్యప్ప మందిరం వరకు ఇరువైపులారోడ్డు, మురుగునీటి కాలువలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో షాపుల ముందు పార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేయడం పరిపాటిగా మారింది. అయినా మున్సిపల్‌ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఆంతర్యం అంతుచిక్కడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ కళ్లముందే నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన భవన యజమానులు విరుద్ధంగా రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేసి వ్యాపారాలు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల కూడళ్లలోనే అనేక అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలు సెట్‌ బ్యాకులకు మంగళం పాడుతూ నిర్మాణాలు జరుగుతున్నాయి.

అస్తవ్యస్తంగా టౌన్‌ప్లానింగ్‌

మున్సిపల్‌ అధికారుల తీరుతో టౌన్‌ప్లానింగ్‌ అస్తవ్యస్థంగా తయారైంది. దీనింతటికీ ప్రధాన కారణం టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అలసత్వం అవినీతి అక్రమాలే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీఎస్‌ బీపాస్‌ ద్వారా అనుమతులు పొంది నిర్మాణాలు చేసిన భవనాలను పరిశీలిస్తే టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల పనితీరు కళ్లకు కట్టినట్లు తెలుస్తోంది. సెట్‌బ్యాకుల సమస్యతోపాటు టౌన్‌లో లే అవుట్లు లేకుండా ఏర్పడిన సిద్దాపూర్‌ కాలనీ, సుందరయ్యనగర్‌, గంజీ వెనుక హనుమాన్‌గర్‌, సాయినగర్‌, శ్రీరాంనగర్‌, కాలనీల్లో అక్రమార్కులు అంతర్గత రోడ్లను సైతం ఆక్రమిస్తున్నారంటే అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో స్పష్టమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement